Interim Budget 2024 : మధ్యంతర బడ్జెట్ లో ఏ శాఖకు ఎన్ని కోట్లంటే..ఆ శాఖకే అత్యధికం..

Interim Budget 2024

Interim Budget 2024

Interim Budget 2024 : మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం గురువారం మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. కేంద్ర బడ్జెట్ లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చేశారు.

మొత్తం బడ్జెట్ రూ.47.66లక్షల కోట్లు కాగా, వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షల కోట్లుగా అంచనా వేశారు.

వివిధ శాఖలకు ఇవి కేటాయింపులు..

మౌలిక వసతుల రంగం: రూ.11.11లక్షల కోట్లు
రక్షణ శాఖ: రూ.6.2 లక్షల కోట్లు
రైల్వే శాఖ : రూ. 2.55 లక్షల కోట్లు
హోంశాఖ : రూ.2.03 లక్షల కోట్లు
వ్యవసాయం, రైతుల సంక్షేమం: రూ.1.27 లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖ : రూ.1.77 లక్షల కోట్లు
ఉపరితల రవాణా , జాతీయ రహదారుల నిర్మాణం: రూ. 2.78 లక్షల కోట్లు
ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థ: రూ.2.13 లక్షల కోట్లు
రసాయనాలు, ఎరువులు : రూ. 1.68 లక్షల కోట్లు
కమ్యూనికేషన్ల రంగం : రూ.1.37 లక్షల కోట్లు
గ్రామీణ ఉపాధి హామీ : రూ.86 వేల కోట్లు
ఆయుష్మాన్ భారత్ పథకం : రూ.7,500 కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలు: రూ.6,200 కోట్లు
సెమీ కండక్టర్లు, డిస్ ప్లే ఎకో వ్యవస్థల తయారీ : రూ.6,903 కోట్లు
సోలార్ విద్యుత్ గ్రిడ్ : రూ.8,500 కోట్లు
గ్రీన్ హైడ్రోజన్ : రూ.600 కోట్లు

కాగా, బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో మౌలిక వసతుల రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ శాఖకే అత్యంత కేటాయింపులు దక్కాయి. ఆ తర్వాత రక్షణ, రైల్వే శాఖకు అధికంగా నిధులు  కేటాయించారు.

TAGS