Rahmanullah Gurbaz : కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న ఇంగ్లిష్ ఆటగాడు ఫిల్ సాల్ట్ జాతీయ విధి నిర్వహణ కోసం ఐపీఎల్ మధ్యలో స్వదేశానికి వెళ్లాడు. దీంతో ఐపీఎల్ ప్లేఆఫ్‌లకు ముందు అతని స్థానాన్ని భర్తీ చేసే విషయంలో కేకేఆర్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రహ్మానుల్లా గుర్బాజ్ మళ్లీ ప్లేయింగ్ -11లో చేర్చారు. అయితే ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఈ సీజన్‌లో కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ సాల్ట్‌ను భర్తీ చేయగలడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ గుర్బాజ్ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై పరుగుల వేటకు అద్భుతమైన ఆరంభాన్ని ఇవ్వగలిగాడు. 8 వికెట్ల అద్భుత విజయం తర్వాత, గుర్బాజ్ తన తల్లి ఇంకా ఆసుపత్రిలో ఉందని చెప్పి అందరి హృదయాలను ద్రవింజేశాడు.
హాస్పిటల్ లోనే గుర్బాజ్ తల్లి
‘మా అమ్మ ఇప్పటికీ ఆసుపత్రిలో ఉంది, నేను రోజూ ఆమెతో మాట్లాడుతున్నాను. కానీ ఫిల్ సాల్ట్ వెళ్లిన తర్వాత, కేకేఆర్ కుటుంబానికి నా అవసరం ఉందనే విషయం నాకు తెలుసు. దీంతో నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరిగి వచ్చాను. నేను ఇక్కడ కూడా సంతోషంగానే ఉన్నాను. మా అమ్మ కూడా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్‌కు రెహ్మానుల్లా గుర్బాజ్ భువనేశ్వర్ కుమార్‌పై ఫోర్‌తో మంచి ఆరంభాన్ని అందించాడు . భువనేశ్వర్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్ బాదాడు. నాలుగో ఓవర్లో ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ వేసిన బంతికి గుర్బాజ్ అవుటయ్యాడు. అఫ్గాన్ ప్లేయర్ ఓపెనర్‌గా దిగి 14 బంతుల్లో 23 పరుగులు చేసి కోల్ కతా నైట్ రైడర్స్ కు శుభారంభం అందించాడు. 22 ఏళ్ల రహ్మానుల్లా గుర్బాజ్ గత ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. గత సీజన్‌లో, అతను 133 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ 11 మ్యాచ్‌ల్లో 227 పరుగులు సాధించాడు.