Test match : ఒక్క బంతి పడకుండానే..  కివీస్, అఫ్గానిస్తాన్ టెస్టు మ్యాచ్ రద్దు.. కారణం ఇదీ

Test match

Test match

Test match : అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ మధ్య గ్రేటర్ నోయిడాలోని స్టేడియంలో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ రద్దయింది.  ఒక్క బంతి పడకుండానే అయిదు రోజుల టెస్టు మ్యాచ్ రద్దు కావడం గమనార్హం. మొదటి రెండు రోజులు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఒక్క చుక్క వర్షం పడకున్నా.. అంతకు ముందు పడిన వర్షం వల్ల గ్రౌండ్ తడిగా ఉండిపోయింది.

తేమ శాతం వల్ల అవుట్ ఫీల్డ్ పూర్తిగా తడిగా మారిపోయింది.  గ్రౌండ్స్ మెన్ ఎన్ని కష్టాలు పడ్డ మొదటి రోజు ఆరలేదు. అంపైర్లు ఫీల్డ్ ను పరిశీలించి మొదటి రోజు ఆటను రద్దు చేశారు. కనీసం టాస్ కూడా వేసేందుకు వీలు లేకుండా ఉండటంతో గ్రేటర్ నోయిడాలోని క్రికెట్ సంఘంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఏ దేశం ఆడుతున్నా సరే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడే సమయంలో ఇలాంటి గ్రౌండ్ కేటాయిస్తారా అని క్రికెట్ నిపుణులు మండిపడ్డారు. మరి ఇంత దారుణమైన పిచ్ ను ఎప్పుడు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్గానిస్తాన్ టీం కివీస్ లాంటి పెద్ద జట్లతో ఆడాల్సిన ఏకైక మ్యాచ్ ను ఇలా ముగించాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదు.

ఇలా 1998లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఒకటి రద్దైనట్లు తెలుస్తోంది. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న సౌకర్యాలు వేరు. బీసీసీఐ పెద్దలు సరిగా దృష్టి సారించకపోవడంతోనే ఇలాంటి వేదికను ఎంపిక చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
గ్రేటర్ నోయిడా స్టేడియంలో ఎక్కువగా కార్పొరేట్ మ్యాచ్ లు జరిగేవి. అక్కడ స్పాట్ ఫిక్సింగ్ జరుగుతుందని తెలుసుకున్న బీసీసీఐ పెద్దలు ఆ స్టేడియంలో మ్యాచ్ ల నిర్వహణను కొనసాగించలేదు. ఇన్ని రోజుల తర్వాత ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ను అలాంటి స్టేడియంలో నిర్వహించాలని అనుకోవడం పొరపాటే అవుతుందని క్రికెట్ ఎక్స్ ఫర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

TAGS