JAISW News Telugu

Kishan Reddy : బీజేపీ జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఇన్ ఛార్జిగా కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జులను బీజేపీ నియమించింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ తరపున ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతల్ని పలువురు కేంద్రమంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించింది. అందులో భాగంగా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ కు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. మహారాష్ట్రకు కేంద్రమంత్రులు భూపేంద్ర యాదవ్ (ఇన్ ఛార్జి), అశ్వనీ వైష్ణవ్ (సహ ఇన్ ఛార్జి)లను నియమించిన బీజేపీ అధిష్ఠానం, హర్యానాకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (ఇన్ ఛార్జి), త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ దేవ్ కుమార్ (సహ ఇన్ ఛార్జి), ఝార్ఖండ్ కు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (ఇన్ ఛార్జి), అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (సహ ఇన్ ఛార్జి)లను నియమిస్తూ సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ ఏడాది చివరలో మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్ లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, జమ్మూకాశ్మీర్ లో సెప్టెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇన్ ఛార్జిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

Exit mobile version