Kiran Rao : ఆమీర్ ఖాన్ తో విడాకుల గురించి ఇటీవల ఆయన మాజీ భార్య కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన విడాకులు సంతోష కరమైన వాతావరణంలో జరిగాయని, నా నిర్ణయం నాకు విముక్తి, సంతృప్తిని కలిగించిందని కిరణ్ రావు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విడిపోవడం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ, అంతిమంగా అది తన శ్రేయస్సుకు ప్రయోజనకరంగా ఉందని కిరణ్ వెల్లడించారు.
‘మా విడాకులు చాలా హ్యాపీగా గడిచాయి. బంధాలను ఎప్పటికప్పుడు పునర్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా.. ఎందుకంటే మనం పెరిగే కొద్దీ మనుషులుగా మారతాం. మాకు భిన్నమైన విషయాలు అవసరం, విడాకులు నాకు సంతోషాన్ని కలిగిస్తాయని నేను భావించా. ఇప్పుడు నేను అనుకున్నదే నాకు దక్కింది. నేను చాలా చాలా సంతోషంగా, నిజాయితీగా ఉన్నాను.’ అని ఆమె అన్నారు.
అయితే వరవరరావు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ‘కొందరు నెటిజన్లు ఆమె విడాకులను ప్రోత్సహిస్తున్నారని, సంప్రదాయ విలువలను దెబ్బతీస్తున్నారని’ ఆరోపించారు. విడాకులను ఆమె సానుకూలంగా చిత్రీకరించడం మన దేశ సంస్కృతిక, కుటుంబ నిబంధనలకు విరుద్ధమని సోషల్ మీడియా యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు కిరణ్ రావుకు అప్పటికే పెళ్లయిన సమయంలోనే ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడంపై ఓ వర్గం మండిపడుతోంది. ఆమె సంబురాలు, విడాకుల ప్రచారం హిందూ అమ్మాయిల్లో తప్పుడు ఉదాహరణను సృష్టించవచ్చని వారు వాదిస్తున్నారు. ఏది ఏమైనా కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.