King Nagarjuna : అఖిల్ కోసం మాట తప్పుతున్న నాగార్జున..ఏంటా మాట?

King Nagarjuna

King Nagarjuna

King Nagarjuna : తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీది ప్రత్యేక స్థానం. అక్కినేని నాగేశ్వరరావు సినీ పరిశ్రమకు ఓ కన్నులాంటి వారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ తెలుగు సినిమాను దేశస్థాయిలో నిలబెట్టారు. ఏఎన్ఆర్ తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తన వారసుడిగా నాగార్జునను తెలుగు తెరకు పరిచయం చేశారు. నాగార్జున తన నటనతో అగ్రహీరోల్లో ఒకరిగా ఉన్నారు. గీతాంజలి, శివ, హలోబ్రదర్, అన్నమయ్య, శ్రీరామదాసు..వంటి ఎన్నో సూపర్ డూపర్ చిత్రాలతో ఫ్యాన్స్ అలరించారు. గత 35ఏండ్లుగా ఆయనది సక్సెస్ ఫుల్ జర్నీ. బిగ్ బాస్ హోస్ట్ గా బుల్లితెరపై సందడి చేస్తుండడం మనం చూస్తున్నదే.

ఇక నాగార్జున తన వారసులైన నాగచైతన్య, అఖిల్ లను కూడా వెండితెరకు తీసుకొచ్చారు. నాగచైతన్య మంచి నటుడిగానే పేరుతెచ్చుకున్నా.. తండ్రిలాగా మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకోలేకపోయారు. మొత్తానికైతే మీడియం రేంజ్ హీరోగా తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక అఖిల్ ను తెలుగు స్టార్ హీరోల్లో ఒకరిగా చేయాలనుకున్న నాగార్జున ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు.

గతంలో ఒకసారి నాగార్జున చేసిన ఓ పోస్ట్ రీసెంట్ గా తెగ వైరల్ అవుతోంది. అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ గురించి నాగ్ మాట్లాడుతూ..అక్కినేని వారసులు సొంత కష్టంతో పైకి రావాలని, దానికి వారు నిరంతరం
కృషి చేయాలని చెప్పారు. అయితే ఈ మాటలను నాగార్జున తప్పుతున్నాడా? అనే అనుమానాలు వస్తున్నాయి.

వాస్తవానికి అఖిల్ కు మంచి అందం, ఫిజిక్, అభినయం ఉన్నా..ఎక్కడో ఏదో మిస్ అవుతోంది. కోట్లు ఖర్చు పెట్టి తీసినా సినిమాలు ఆడకపోవడంతో అక్కినేని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. చిన్న చిన్న హీరోలు హిట్లు కొడుతూ.. తమ కెరీర్ ను నిర్మించుకుంటున్నారు. అయితే అన్నీ ఉండి కూడా అఖిల్ హిట్ కొట్టకపోయే సరికి నాగ్, అమల ఆవేదన చెందుతున్నారు.

ఎలాగైనా అఖిల్ ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ పడేలా చూడడానికి తాను చెప్పిన ‘స్వయంకృషి’ మాటలను పక్కకు పెట్టి మంచి చాన్స్ లు ఇప్పించేందుకు చూస్తున్నారు. ఆఫర్స్ కోసం దర్శకులకు, నిర్మాతలకు గాలం వేస్తున్నారని అంటున్నారు. అఖిల్ చేత ఒక్క హిట్ కొట్టించండంటూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పాపం అఖిల్ కు ఈ ఏడాదైనా కలిసి వస్తుందో లేదో..హిట్టు సినిమా పడుతుందో చూడాలి.

TAGS