King Nagarjuna : ఖిలాడీనే దించుతున్న కింగ్ నాగార్జున.. మరో కొత్త దర్శకుడితో..
King Nagarjuna : ఇటీవల కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో సంక్రాంతి సెంటిమెంట్ కలిసి వచ్చిందని అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఇదే ఉత్సాహంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీలో నాగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మెయిన్ లీడ్ ధనుష్ పోషిస్తుండగా.. నాగ్ కీలకంగా వ్యవహస్తున్నట్లు తెలుస్తోంది.
శేఖర్ కమ్ముల తెరకెక్కించే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో కథ సాగుతుంది. పాన్ ఇండియా లెవల్ లో దీన్ని తెరకెక్కించాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు హీరోలతో తెలుగు, తమిళంలో కోట్లాది రూపాయల బిజినెస్ శేఖర్ కమ్ముల ప్లాన్ . అందుకే ఈ కాంబో తెరపైకి తెచ్చి కమ్ముల సైతం కొత్త జానర్ లో ట్రై చేస్తున్న సినిమా ఇది. రీసెంట్ గా నాగార్జున కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి మరో అప్ డేట్ వినిపిస్తోంది.
తమిళ కుర్రాడు నవీన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కింగ్ తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది స్క్రిప్ట్ దశలో ఉంది. ఈ మూవీని కూడా కింగ్ పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కథలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ను దించాలని అనుకుంటున్నారట. టీమ్ అక్షయ్ తో సంప్రదింపులు కూడా చేస్తున్నట్లు సమాచారం.
బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ సినిమాలు ఏటా ఎక్కువగా కనిపిస్తుంటాయి. పాత్ర నచ్చిందంటే ఒకే చేయడం షూటింగ్ లోకిదిగడం నో.. అనే మాట ఆయనకు తెలియదు. నెగిటివ్ రోల్ అయినా చేస్తానంటారు. ఈ నేపథ్యంలో నాగ్ తదుపరి సినిమా భారీ పాన్ ఇండియా సినిమా అయ్యేందుకు ఛాన్స్ ఉంది. ఇప్పటికే ‘బ్రహ్మస్త్ర’లో నాగార్జున నటించారు. ఆ సినిమాకు సీక్వెల్ నేపథ్యంలో నాగ్ మల్టీస్టారర్ పై మంచి బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది.