Kim Jong Un : ఉత్తర కొరియా.. ఈ పేరు వింటేనే నియంత పాలన గుర్తుకొస్తుంది. హిట్లర్ భావజాలంతో అత్యంత క్రూరంగా హింసించే నేతల్లో ఆ దేశాధినేత కూడా ఒకరు. అక్కడ నైతిక విలువలు ఉండవు. మనుషులు చీమల్లా చూస్తారు. వారి ఆగడాలకు బలి కావాల్సిందే. దేశం విడిచి పారిపోవాలని చాలా మంది ప్రయత్నించి ప్రాణాలు వదిలారు. అక్కడ శిక్షలు కూడా అంత కఠినంగా ఉంటాయి.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంత పాలనకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అక్కడ చట్టాలు పనిచేయవు. అతడి ఆదేశాలే చట్టాలు. అతడు చెప్పిందే శాసనం. అతడు అన్నదే వేదం అన్నట్లుగా ఉంటుంది. ప్రజాస్వామ్య విలువలకు ప్రాణం లేదు. అతడు కోరుకున్నదే జరుగుతుంది. కాదంటే అంతే సంగతి. వారికి జైలు జీవితమే. నరకమంటే ఏంటో ప్రత్యక్షంగా చూపిస్తారు.
ఆడవారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. కిమ్ ప్రతి ఏటా 25 మంది యుక్త వయసు కన్నె పిల్లలను ఎంపిక చేసుకుంటాడు. వారిని మూడు గ్రూపులుగా విభజిస్తారు. అందులో ఒక గ్రూపు కిమ్ కు మసాజ్ చేస్తుంది. మరో గ్రూపు పాటలు, డాన్సులతో అలరిస్తుంది. మూడో గ్రూపు కిమ్ తో పాటు అతడి అనుచరుల కామవాంఛలు తీరుస్తారట. ఇలా కిమ్ వారితో జల్సాలు చేస్తాడట.
అలా కిమ్ తన రాజ్యంలో సుఖభోగాలు అనుభవిస్తాడు. తాను అనుకున్నది చేస్తాడు. తను చెప్పింది వినకపోతే ఎంతకైనా తెగిస్తాడు. నరకమంటే నార్త్ కొరియానే ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి. దేశం దాటి వెళ్లాలనుకున్న వారు చాలా మంది ప్రాణాలే కోల్పోయారు. అంతటి ప్రమాదకర స్థాయిలో శిక్షలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.
ఉత్తర కొరియా అంటే ప్రపంచానికే భయం వేస్తుంది. అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించి ప్రపంచానికే సవాలు విసిరిన ఉత్తర కొరియా తీరు వివాదాస్పదమే. కిమ్ చర్యలు కూడా అలాగే ఉంటాయి. దేశంలో ఎవరు కూడా అతడి ఆదేశాలను పాటించకపోతే ఊరుకోడు. అవసరమైతే చంపేయడానికి కూడా వెనకాడరంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.