JAISW News Telugu

Kidnapping : ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్

– నర్సు వేషంలో వచ్చి ఎత్తుకెళ్లిన మహిళ

Kidnapping

Kidnapping

Kidnapping : కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు గంటల వ్యవధిలోన చేధించారు. జిల్లాలోని శ్రీకాకుళం గ్రామానికి చెందిన స్వరూపరాణి అనే మహిళ కాన్పు కోసం మచిలీపట్నం ఆసుపత్రిలో చేరింది. మూడు రోజుల క్రితం మగ శిశువుకు జన్ననిచ్చింది. గైనిక్ వార్డులో శనివారం రాత్రి 1.30 గంటలకు నర్సు వేషంలో ఇంగ్లీష్ పాలెంకి చెందిన లక్ష్మి అనే మహిళ శిశువును ఎత్తుకెళ్లింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి శిశువు ఎత్తుకెళ్లిన మహిళను సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు.  గంటల వ్యవధిలో పోలీసులు బిడ్డను తల్లి వద్దకు చేర్చారు. నిందితురాలు ఇంగ్లిష్ పాలెంకు చెందిన లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. శిశువు తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version