Congress : ఖమ్మం కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు?

Khammam Congress power struggle?

Khammam Congress power struggles

Khammam Congress : ఖమ్మం కాంగ్రెస్ లో వర్గ పోరు కొనసాగుతోంది. ఒకే పార్టీలోనే వేరు కుంపట్లు రేగుతున్నాయి. తమదంటే తమదే అంటూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లో నెంబర్ టూ తానే నంటూ ఇద్దరు నేతలు తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్ కు నేనే దిక్కు అంటూ గగ్గోలు పెడుతున్నారు.

మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఒకరి కంటే మరొకరు పోటీ పడుతున్నారు. ఇటీవల పొంగులేటి భార్య కూడా సోషల్ మీడియా వేదికగా భట్టిపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. ఇద్దరు నేతలు ఒకే జిల్లాకు చెందిన వారే ఇలా కొట్టుకోవడంతో పార్టీలో రసవత్తర పోరు జరుగుతోంది. ఈనేపథ్యంలో పార్టీ గెలిచి మూన్నాళ్లు కూడా కాకుండానే వర్గ పోరు కొనసాగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చే కొమ్ములకే వాడి ఎక్కువ. మల్లు భట్టి విక్రమార్క మొదటి నుంచి పార్టీలోనే ఉంటూ సీనియర్ గా పేరుతెచ్చుకున్నాడు. పొంగులేటి పార్టీలు మారి ఆలస్యంగా వచ్చి తానే నెంబర్ టూ అంటూ చెప్పుకోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వాడిగా భట్టికే ప్రాధాన్యం ఉంటుంది.

ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెక్ పెట్టాలనే వాదనలు కూడా వస్తున్నాయి. పొంగులేటి తన భార్యకు ఎంపీ టికెట్ ఇప్పించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ లో తానే నెంబర్ టూ అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. ఎవరికి వారే నెంబర్ టూ అంటే అయిపోతారా? దీంతో భట్టికి స్పాట్ పెడతారా అనే వాదనలు కూడా వస్తున్నాయి.

TAGS