JAISW News Telugu

Tamil Nadu : 50 మందిని పెళ్లి చేసుకున్న కీలేడీ

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu : తమిళనాడు రాష్ట్రంలో ఓ నిత్య పెళ్లికూతురు కథ వెలుగులోకి వచ్చింది. ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకున్న ఆమె నగలు, డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోంది. ఆమె వలలో చిక్కుకున్న ఓ డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులతో సహా 50 మందిని పెళ్లి చేసుకుంది.

తమిళనాడు తిరువూరుకు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిల్ వే అనే వెబ్ సైట్ లో చూసి సంధ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పుతో అనుమానం వచ్చి తన ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది. అతను ప్రశ్నించగా సంధ్య చంపేస్తానని బెదిరించింది.

దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించగా సంధ్యను అదుపులో తీసుకొని విచారించగా అప్పటికే సంధ్య ఒక డీఎస్పీ, ఒక పోలీసు ఇన్ స్పెక్టర్, మధురైలో మరో పోలీసు అధికారి, కరూర్ లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా పెళ్లి చేసుకుందని వెల్లడయింది.

Exit mobile version