JAISW News Telugu

Revanth Reddy:య‌శోద ఆసుప‌త్రిలో కేసీఆర్‌..సీఎం రేవంత్ కీల‌క అదేశాలు

Revanth Reddy:మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గురువారం అర్థ్ర‌రాత్రి ఫామ్‌హౌస్ బాత్‌రూమ్‌లో కాలుజారి ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న తొంటికి తీవ్ర గాయ‌మైంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే కేసీఆర్ కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను గ‌జ్వేల్ స‌మీపంలోని ఫామ్ హౌస్ నుంచి హైద‌రాబాద్ సోమాజీగూడలోని య‌శోద హాస్పిట‌ల్‌కు హుటా హుటిన త‌ర‌లించారు. కేసీఆర్‌ను ప‌రిశీలించిన డాక్ట‌ర్లు ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ప్ర‌త్యేక చికిత్స అందిస్తున్నారు.

కేజీఆర్‌కు వివిధ ప‌రీక్ష‌లు నిర్వహించిన వైద్యులు ఆయ‌న తుంటి య‌ముక రెండు చోట్ల విరిగిన‌ట్లు గుర్తించారు. ఈ రోజే ఆయ‌న‌కు శ‌స్త్ర చికిత్స చేయ‌నున్నారు. విరిగిన తుంటి య‌ముక‌కు రెండు చోట్ల స్టీల్ ప్లేట్లు వేసే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు తెలిపారు. కేసీఆర్‌కు ప్ర‌మాదం, య‌శోద హాస్ప‌ట‌ల్‌లో చేరిక వంటి విష‌యాలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. య‌శోద ఆసుప‌త్రి వ‌ద్ద భ‌ద్ర‌త పెంచాల‌ని అధికారుల‌ని ఆదేశించారు. దీంతో అధికారులు సీఎం ఆదేశాల మేర‌కు ఆసుప‌త్రి వ‌ద్ద భ‌ద్ర‌త‌ను పెంచ‌నున్నారు.

Exit mobile version