AP Government : ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం ఏమిటో తెలుసా?
AP Government : ఆంధ్రప్రదేశ్ లో కులగణన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంటింటికి వెళ్లి 20 అంశాలపై సమాచారం సేకరిస్తారు. కుల గణన వారం రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టుగా మూడు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయ పరిధిలో సర్వే నిర్వహించారు.
ఈనెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయనున్నారు. డిసెంబర్ 3 నాటికి సర్వే పూర్తి చేయనుంది. వాలంటీర్లు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి 20 అంశాలపై సమాచారం సేకరిస్తారు. ఒకవేళ ఇంటికి తాళం వేసి ఉన్నా వివరాలు సేకరించే వరకు వారం గడువు ఇచ్చి అయినా సరే సర్వే పర్తి చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసింది.
సర్వే ప్రారంభం నుంచి ముగించే వరకు వాలంటీర్ ఒకే సెల్ ఫోన్ ను వినియోగించాలి. వివరాలు సేకరించేటప్పుడు స్క్కీన్ షాట్లు లేదా వీడియో రికార్డింగులు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సర్వేలో చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, కులం, ఉపకులం, మతం, రేషన్ కార్డు నెంబర్, విద్యార్హత, ఇంటి వివరాలు, వంట గ్యాస్ తో పాటు ఉపాధికి సంబంధించిన వాటిని సేకరిస్తారు.
ఎక్కడైతే నివాసం ఉంటారో అదే శాశ్వత చిరునామాగా భావించుకోవాలి. ఎవరైనా చనిపోతే దాన్ని నిర్ధారిస్తూ వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది. త్వరలో జరిగే కులగణకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వే యాప్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. కులగణనలో ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.