IPL : ఐపీఎల్ రేట్ అండ్ విధానం లో కీలక మార్పులు.. అన్ క్యాప్డ్ ప్లేయర్లపై ఈ నిర్ణయం
IPL : ఐపీఎల్ ఆటగాళ్ల రిటైన్ విధానంలో బీసీసీఐ ఐపీఎల్ పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఇద్దరు విదేశీ ప్లేయర్లు, ఇద్దరు స్వదేశీ ప్లేయర్లు.. లేదా నలుగురు ప్లేయర్లను తమ టీంతో అట్టిపెట్టుకునే అవకాశం ఉండేది. కాగా ఫ్రాంచైజీలు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ప్లేయర్ల రిటైన్ విషయంలో కోరుతున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు అన్ క్యాప్డ్ ప్లేయర్ల విధానంలో ప్లేయర్లను అట్టిపెట్టుకోవాలనుకునే రూల్ ఏం లేదు. కానీ ఫ్రాంచైజీలు వారిని కొనుగోలు చేసి వారికి మంచి శిక్షణ ఇచ్చి వేలంలోకి వదిలేసేందుకు ఇష్టపడటం లేదు. కనీసం ముగ్గురు అన్ క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకునే విధానం తీసుకురావాలని ఫ్రాంచైజీలు ఐపీఎల్ యాజమాన్యాన్ని, బీసీసీఐను కోరుతున్నాయి. మరి ఈ విషయంలో బీసీసీఐ, ఐపీఎల్ కమిటీలు ఆలోచనలో పడ్డాయి.
బీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్ లో ఇంఫాక్ట్ ప్లేయర్ విధానం తీసుకురావడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అన్ క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకునే విధానం వల్ల వారికి మిగతా ఫ్రాంచైజీలు తీసుకునే అవకాశం ఉండదు. వారికి చాన్స్ లు రాకపోతే వారి ప్రతిభ మూలన పడే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్ టీంలో నితీశ్ కుమార్ రెడ్డి, పంజాబ్ టీంలో శశాంక్ సింగ్ ఇలా అన్ క్యాప్డ్ ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు కొనసాగించాలనుకోవడం వల్ల వారికి ఒక వేళ జట్టులో ఆడే చాన్స్ రాకపోతే టాలెంట్ ఆ సంవత్సరం వృథా అయిపోయినట్లే. కాబట్టి అన్ క్యాప్డ్ ప్లేయర్ల విషయంలో బీసీసీఐ గానీ, ఐపీఎల్ యాజమాన్యం గానీ సరైన నిర్ణయాలు తీసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఐపీఎల్ కంటే టీం ఇండియా క్రికెట్ ముఖ్యమని అన్ క్యాప్డ్ ప్లేయర్లకు ఎక్కువగా అవకాశాలు వస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఐపీఎల్ యాజమాన్యం బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ వేచి చూస్తున్నారు.