JAISW News Telugu

Swati Maliwal : స్వాతి మలివాల్ పై కేజ్రీవాల్ పీఏ దాడి..  వైరల్ వీడియో

Swati Maliwal

Swati Maliwal : స్వాతి మలివాల్..ఇప్పుడు దేశంలో తెగ వైరల్ అవుతున్న పేరు. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఉన్న స్వాతి మలివాల్ రాజ్యసభ ఎంపీ కూడా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి జరిగిందని, కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కొద్ది రోజుల క్రితం స్వాతి మలివాల్ ను తిట్టి, కాలితో తన్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో దుమారం రేపుతోంది. సొంత పార్టీ నేతపైనే దాడి చేయడం ఆప్ ప్రతిష్టను దిగజార్చుతోంది.

ఢిల్లీలోని ఎయిమ్స్ లో శుక్రవారం స్వాతి మలివాల్ కు దాదాపు 3 గంటల పాటు వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షలో ఆమె ముఖంపై ఇంటర్నల్ ఇంజూరీస్ అయినట్లు తేలింది. దాడి జరిగిన రోజే స్వాతి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా అక్కడ అంతా నార్మల్ గా ఉంది. తర్వాత కూడా ఆమె అక్కడ లేదు. ఆమెపై దాడి జరిగిందా లేదా అని రెండు రోజులుగా చర్చ జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బిభవ్ ను నిందితుడిగా పేర్కొన్నారు. ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సైతం సుమోటోగా తీసుకుంది.

ఇదిలా ఉండగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ లో స్వాతి మలివాల్ పై జరిగిన దాడి అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలోకి విడుదలైంది. ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి, ఓ మహిళ ఇష్టారీతిన తిడుతూ హేయంగా దాడి చేసినట్లు  కనపడుతోంది. అయితే ఇది అధికారిక వీడియో కానట్లు తెలుస్తోంది. మొత్తానికైతే స్వాతి మలివాల్ పై దాడి అంటూ ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.

కాగా సొంత పార్టీ నేతపై దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే దానిపై వివిధ ఊహగానాలు వినపడుతున్నాయి. కేజ్రీవాల్ బెయిల్ అనంతరం మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన జైలులో ఉంటే సీఎంగా ఎవరిని చేయాలనేది ఆప్ లో నలుగుతున్న విషయం. సీఎం పదవి కోసం స్వాతి మలివాల్, అతీశీ మర్లోనా, సంజయ్ సింగ్..పలువురు సీఎం కావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే కేజ్రీవాల్ మాత్రం తన భార్యను సీఎం చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాతి మలివాల్ పై దాడి జరిగిందా? అనే కోణంలో విశ్లేషణలు వినపడుతున్నాయి. ఆప్ లో అసలేం జరుగుతోంది? అనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు. అయితే స్వాతి మలివాల్ బీజేపీ వారు కుట్రలో భాగమైందని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.

Exit mobile version