JAISW News Telugu

Arvind Kejriwal : కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు – జూన్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీ

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal : తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ను పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది. కేజ్రీవాల్ పిటిషన్‌ను తాజాగా తిరస్కరించింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని జూన్ 19 వరకు పొడిగించింది. ఆయన వైద్య అవసరాలను చూసుకోవాలని జైలు అధికారులకు ఆదేశించింది.

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండడంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ.. కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్ 2న తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు.

Exit mobile version