Keerthy Suresh : అతనితో నాది 7 ఏళ్ళ బంధం అంటూ కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
Keerthy Suresh : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్ కీర్తి సురేష్. ‘నేను శైలజ’ చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్, ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకుంది. అంతే కాకుండా నేటి తరం హీరోయిన్స్ లో నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ కూడా కీర్తి సురేష్ మాత్రమే.
‘మహానటి’ సినిమాలో సావిత్రి గా అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను ఆమె ఈ అవార్డుని ఇచ్చారు. అయితే ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేసినా, కొన్ని చిత్రాల గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఎంతో మంది కలిసి నటిస్తూ ఉంటారు, కానీ నటీనటుల మధ్య బంధాలు అంత తేలికగా ఏర్పడవు. కానీ ఒకే ఒక్క సినిమాతో న్యాచురల్ స్టార్ నాని కుటుంబ సభ్యులలో ఒకరిగా మారిపోయింది కీర్తి సురేష్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ‘నేను లోకల్’.
అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి యావరేజి టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాధించింది. ఆరోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా కుదిరింది. ‘హేయ్ పొట్టి’ అనే డైలాగ్ అప్పట్లో ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాని కి మాస్ ఇమేజి ని తెచ్చిపెట్టిన ఈ సినిమా విడుదలై 7 ఏళ్ళు పూర్తి అయ్యింది.
ఈ సందర్భంగా కీర్తి సురేష్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘ఈ సినిమా విడుదలై అప్పుడే 7 ఏళ్ళు అయ్యిందంటే అసలు నమ్మలేకపోతున్నాను, నానితో ఈ చిత్రం తోనే నాకు బలమైన బంధం ఏర్పడింది, అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మన ఇద్దరం ఇలాంటి సినిమాలు చేస్తూనే ఉండాలి’ అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టింది. దానికి నాని రిప్లై ఇస్తూ ‘కచ్చితంగా చేద్దాం..నిన్ను డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటా’ అంటూ చెప్పుకొస్తాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరు కలిసి ‘దసరా’ చిత్రం లో నటించారు. ఈ సినిమా కూడా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనమంతా చూసాము. నాని కెరీర్ లో మొట్టమొదటి వంద కోట్ల రూపాయిల గ్రాస్ సినిమా ఇదే.