KCR : పోతూ పోతూ.. కేసీఆర్ చేసిన నిర్వాకం.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
KCR : తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేది మేమే.. తమది తెలంగాణ ఇంటి పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ చెప్పేది ఒకటైతే.. చేసేది మరొకటి. తెలంగాణ ప్రజలకు ఏ అన్యాయం జరిగితే ఊరుకోం అని డైలాగులు మనకు ఇంకా గుర్తే. కానీ వారి హయాంలో చేసిందేంటో అందరికీ తెలుసు. వివిధ రంగాల్లో తెలంగాణ వారికి గుండు సున్నా పెట్టి.. ఇతర రాష్ట్రాల వారిని నెత్తిన మోసింది. ఎన్ని విమర్శలు వచ్చినా.. మేధావులు, ఉద్యమ కారులు నెత్తినోరు బాదుకున్నా కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు ఆ ఆగ్రహాగ్నితోనే ఆయన గద్దె దిగాల్సి వచ్చింది.
తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లేనట్టు కీలక శాఖల్లో అంతా యూపీ, బిహార్ ఉద్యోగులతోనే నింపేశారు. తెలంగాణకు చెందిన ఆకునూరి మురళి, బుర్రా వెంకటేశం వంటి బడుగు వర్గాల ఉన్నతాధికారులను ఏదో మాములు శాఖల్లోకి నెట్టివేశారు. మన వాళ్ల పనితీరు బాగానే ఉన్నా..వారిలో తెలంగాణ ప్రేమ నరనరాన ఉన్నా కేసీఆర్.. తన పేషీలో అంతా ఉత్తరాది ఉద్యోగులనే చేర్చుకున్నారు. తెలంగాణ మట్టివాసన తెలియని వాళ్ల పాలన ఎలా ఉందో మనం చూసే ఉన్నాం.
ఇక కేసీఆర్ ప్రభుత్వం పోతూ పోతూ..కేంద్రానికి కన్ఫర్డ్ ఐఏఎస్ ల చిట్టా ఒకటి కేంద్రానికి పంపింది. ప్రతీ సంవత్సరం కొంత మంది గ్రూప్-1 సీనియర్ అధికారులకు సీనియార్టీ, మెరిట్ ప్రాతిపదికన కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తారు. ఐఏఎస్ హోదా రావడమనేది వారి జీవిత కల. అలా నాలుగు రోజులు ఉండి రిటైర్ అయినా ఆ గౌరవం, హోదా వేరు. దానిలో కలిగే తృప్తి వేరు.
కేసీఆర్ సర్కార్ గతేడాది ఓ పది మంది జాబితాలో ముగ్గురు ఏపీ అధికారుల పేర్లను చేర్చి పంపింది. వీరిలో ఒకరు గుంటూరు, మరొకరు కృష్ణా జిల్లా, ఇంకొకరిది రాయలసీమలోని ఓ జిల్లా. వీరిలో ఇద్దరికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఐఏఎస్ హోదా కట్టబెట్టింది. ఈ విషయం కొత్తగా వచ్చిన రేవంత్ దాక రానట్టుందని తెలుస్తోంది. తెలిస్తే వారి స్థానంలో తెలంగాణకు చెందిన అధికారుల పేర్లు చేర్చితే.. మన వాళ్లే ఐఏఎస్ హోదా పొందేవారు.
మొత్తానికి కేసీఆర్ మన ఉద్యోగులు, నిరుద్యోగులపై వెళ్తూ వెళ్తూ కూడా ఇలా నష్టం చేశాడని పలువురు విమర్శిస్తున్నారు. తెలంగాణ గోచి, గొంగడి అంటూ తెల్లారి లేస్తే డైలాగులు వల్లించే కేసీఆర్ అండ్ కో చేసిన నిర్వాకం ఇది.