KCR:బీఆర్ఎస్ శ్రేణులకు గుడ్ న్యూస్..రేపు ఆస్పత్రి నుంచి కేసిఆర్ డిశ్చార్జ్

KCR:తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి ఎముక గాయంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవ‌లే ఆయ‌న‌కు య‌శోద డాక్ట‌ర్లు స‌ర్జ‌రీ చేశారు. ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌లో కేసీఆర్‌ చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌ని సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయాధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుతో పాటు ప‌లువురు రాకీయ‌, సినీరంగ ప్ర‌ముఖులు ప‌రామ‌ర్శించ‌డం తెలిసిందే.

ఇదిలా ఉంటే కేసీఆర్ శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంద‌ని తెలిసింది. ఈ మేరకు వైద్యులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. గత గురువారం అర్థ్రరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో జారిపడడంతో కెసిఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిం దే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కెసిఆర్ ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి నేరుగా ఆయన ఫామ్ హౌజ్ కు వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

TAGS