Jagan Requests KCR Against Babu : ఏపీలో కక్షసాధింపు రాజకీయాలు జరుగుతున్నాయా .. అంటే అవుననే అంటున్నారు రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు. ఏపీలో వైసీపీ నేతృత్వంలోని జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతిపక్షాలను టార్గెట్ చేసింది. దీంతో పాటు తమకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఒక్కరిపై వేధింపులు, బెదిరింపులు, కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో రెండు నెలలుగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వరుస కేసులు పెడుతూ పోతున్నది. ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక, ఇలా కేసులతో వేధించే పనిలో పడింది. దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
అయితే ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ కాగా, 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తో నెల రోజుల పాటు ఆయన విడుదలయ్యారు. అయితే ఆ తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం మద్యం, ఇసుక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ అంటూ ఇలా వరుస కేసులతో చంద్రబాబుపై విరుచుకుపడుతున్నది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం వరుస పెడుతుండగా, తెలంగాణలో ఓటుకు నోటు కేసును మరోసారి ఓపెన్ చేయాలని సీఎం కేసీఆర్ ను రిక్వెస్ట్ చేశారట. దీనిని సీఎం కేసీఆర్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈ సమయంలో చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే ఇక్కడ చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు ఓపెన్ చేయాలని అడిగింది ఏపీ సీఎం జగన్ మాత్రమే అయి ఉంటారని అంతా భావిస్తున్నారు. ప్రతిపక్షాలను నేరుగా ప్రజాక్షేత్రంలో ఇలాంటి కుటిల బుద్ధి జగన్ చూపుతున్నాడని తెలుగు దేశం శ్రేణులు మండిపడుతున్నాయి.