Minister Uttam Kumar : పదేళ్లలో కేసీఆర్ అండ్ పార్టీ కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షా 81 వేల కోట్లు ఖర్చు అవుతుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టినా నామమాత్రపు ఆయకట్లు మాత్రమే వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం పర్యాటక ప్రాంతంగా మార్చారు. కేసీఆర్ అవసరాల కోసమే ఈ ప్రాజెక్టును నిర్మించారన్నారు. వాళ్లే అప్పుడు, ఇప్పుడు పోతున్నారు, వస్తున్నారని విమర్శించారు.
గత ఏడాది పెద్ద శబ్దం వచ్చి కాళేశ్వరం కూలిపోయినా దొంగ నాటాకాలాడారని అన్నారు. ప్రాజెక్టు పిల్లర్లు 6 ఫీట్లు భూమిలోకి కుంగాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నేషనల్ డ్యామ్ సేఫ్టీ పరిశీలించిందన్నారు. ఎన్ఎస్డీఏ ఉత్తది కాదు.. పార్లమెంటులో చట్టం ద్వారా ఏర్పాటు చేసింది. అలాంటి సవస్థ విజిట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని నిర్ధారించిందని మంత్రి తెలిపారు. మేం అధికారంలోకి రాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది. పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని వార్తలు వస్తే కేసీఆర్ ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.