KCR : ఇంకా వీల్ చైర్ లోనే కేసీఆర్.. ప్రచారం కూడా అందులో నుంచే నట!

KCR is still in a wheelchair.

KCR is in a wheelchair

KCR : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు తుంటి గాయంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నాడు. ఇటీవల ఆయన డిశ్చార్జి అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీల్ చైర్ లో కూర్చొనే ప్రచారం చేస్తూ ఓటర్ల నుంచి సానుభూతి పొందేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ సానుభూతి అస్త్రంను వాడుతున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి కొన్ని సీట్లయినా రాకుంటే ముప్పు తప్పదని ఆయన ఆందోళన చెందుతున్నారు.

ఇది ఇలా ఉండగా, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని దృష్టిలో ఉంచుకొని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రమంగా పార్టీకి దూరమై ఇతర పార్టీలతో టచ్ లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది.

వీల్ చైర్ లో తిరగడం ద్వారా తన ఆరోగ్యం కంటే పార్టీ ముఖ్యమన్న బలమైన సందేశాన్ని పంపాలని, అదే సమయంలో ఓటర్లు, క్యాడర్ నుంచి సానుభూతి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజే ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్‌లో బాత్ రూమ్ లో జారిపడడంతో కేసీఆర్ నడుము విరిగింది.

గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కేవలం సపోర్ట్ తో నిల్చొని కొన్ని అడుగులు వేయగలుగుతున్నాడు. సుడిగాలి పర్యటనలు చేయడానికి ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని వారాలు అవసరమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే అప్పటికి సార్వత్రిక ఎన్నికలు పూర్తిగా అయిపోతాయని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. అందుకే రోజుకు రెండు నియోజకవర్గాల్లో మాత్రమే పర్యటించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయన తన ఫాంహౌస్ లో పార్టీ నేతలతో తన ప్రణాళికల సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి 1న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ఇందుకోసం కూడా వీల్ చైర్ లో సభాస్థలికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

TAGS