KCR-Jagan : జగన్ యాత్రలను కాపీ కొడుతున్న కేసీఆర్

KCR-Jagan

KCR-Jagan

KCR-Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ అధినేత, సీఎం జగన్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలు,బస్సు యాత్రలతో తీరిక లేకుండా ప్రచారంలో మునిగిపోయారు. తనకు అనుకూలంగా ఉన్నటువంటి బస్సు యాత్రను ఎంచుకున్నారు వైసీపీ చీఫ్ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. బస్సు యాత్రతో రోజుకు ఒక జిల్లాను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేపట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు రెండువేల కిలోమీటర్లకు పైగా బస్సు యాత్ర న చేపట్టారు. ఈ యాత్ర అటు ప్రతిపక్ష పార్టీలకు సైతం కంటిమీద కునుకు లేకుండ చేసింది. బస్సు యాత్ర ఎక్కడ ఏర్పాటు చేసిన విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగి పోయారు.

వైసీపీ నేత చేపట్టిన బస్సు యాత్ర విజయవంతం కావడంతో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కన్ను బస్సు యాత్ర పై పడింది. రాష్ట్రంలోని పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడానికి మాజీ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆయనతోపాటు మాజీ మంత్రి హరీష్ రావ్ కూడా పార్టీని కాపాడుకొని అభ్యర్థులను గెలిపించుకోడానికి సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ ఇద్దరు నాయకులు చేపట్టిన సభలు, సమావేశాలతో మాజీ సీఎం కేసీఆర్ ఉహించినంతగ పార్టీ లక్ష్యాన్ని చేరుకోలేదు. ఇద్దరు నాయకులు ప్రచారంలో మునిగిపోయినప్పటికీ కేసీఆర్ ఫామ్ హౌస్ కె పరిమితం అయ్యారు. కూతురు కవిత జైలు కు వెళ్లడంతో కూడా ఆయన కొంతమేరకు మానసికంగా ఇబ్బందుల్లో పడిపోయారు. ఒకవైపు కూతురు జైలు వెళ్లడం, పార్టీ అధికారాన్ని కోల్పోవడం, ఎం మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచిన వారు, ఓటమిపాలైనవారు కారు దిగిపోవడం పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టాయి.

ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగక తప్పలేదు. జగన్ చేపట్టిన బస్సు యాత్ర ఫలితాలపై సమీక్షించారు. కేసీఆర్ కూడా అదేబాటలో యాత్ర చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర తో కొడుకు, అల్లుడు చేపట్టిన సమావేశాల కంటే ఎక్కువ జనంలో స్పందన రావడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. బస్సు యాత్రతో వస్తున్న జనం స్పందన చూసిన కేసీఆర్ ఎన్నికలయ్యే వరకు కొనసాగించే అవకాశాలు కనబడుతున్నాయి.

TAGS