BJP MP Laxman : కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman

BJP MP Laxman

BJP MP Laxman : రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని  పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి లక్ష్మణ్ మాట్లాడారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలి తీసుకుందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి బీజేీ మద్దతు తెలిపి పోరాటం చేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు మద్దతు ఇస్తామని అప్పట్లో రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారని తెలిపారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ కోసం గళమెత్తారని తెలిపారు.

‘‘సీఎం రేవంత్ రెడ్డి చరిత్రను వక్రీకరిస్తున్నారు. 1200 మంది బలిదానాల మీద తెలంగాణ ఏర్పడింది. ఉద్యమ సమయంలో సోనియా గాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారు. సీఎం అయ్యాక ఆమెను ఎలా ఆరాధిస్తున్నారు? కేసీఆర్ ప్రభుత్వం కవులు, కళాకారులు, ఉద్యమకారులను విస్మరించింది. రేవంత్ రెడ్డి రాజకీయ వివాదాలు సృష్టించి కాలం గడుపుతున్నారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ను విస్మరిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పడం సరికాదు. సకల జనులు పోరాటం చేసి సాధించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అమలు చేయకపోవడం వల్లే కేసీఆర్ ను గద్దె దించారు. ఆయన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదు’’ అని లక్ష్మణ్ ప్రశ్నించారు.

TAGS