CM Revanth : ఓయూపై కేసీఆర్ తప్పుడు ప్రచారం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth

CM Revanth

CM Revanth : ఉస్మానియా యూనివర్సిటీలో నీటి, విద్యుత్ కొరతపై కేసీఆర్ చేసిన ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని అన్నారు. ఓయూకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

గత సంవత్సరంలో కూడా నెల రోజుల పాటు ఓయూ హాస్టళ్లు, మెస్ లను మూసివేశారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే యూనివర్సిటీని మూసివేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. కావాలనే తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని ధ్వజమెత్తారు.

గత సంవత్సరం (2023) కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు యూనివర్సిటీకి సెలవు ఇచ్చారు. మరి అప్పుడు విద్యుత్, నీటి కొరతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చాకే ఓయూ మూసివేసినట్లు దిక్కుమాలిన ప్రచారం చేయడం ఆయన దిగజారుతనానికి నిదర్శనమని xలో విమర్శించారు.

TAGS