JAISW News Telugu

KCR:కేసీఆర్ కూతురు క‌విత జైలుకు వెళుతుందా?

 

KCR:తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించ‌ని విధంగా ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో అధికార బీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ‌లో అధికారాన్ని కోల్పోక త‌ప్ప‌లేదు. ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి కూడా అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ ని సొంతం చేసుకోవాల‌న్న కేసీఆర్ క‌ల క‌ల‌గానే మిగిలిపోయింది. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌కు తెలంగాణ ప్ర‌జ‌లు భారీ షాక్ ఇచ్చారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా నెత్తిన పెట్టుకుని రెండు ద‌ఫాలుగా ప‌దేళ్ల పాటు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు.

అయితే తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం బిఆర్ ఎస్ ని ప్ర‌తి ప‌క్షానికే ప‌రిమితం చేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టం క‌ట్టారు. దీంతో బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్ అంతా ఒక్క‌సారిగా రివ‌ర్స్ అయింది. హ్యాట్రిక్ విజ‌యం వ‌రించ‌క‌పోవ‌డం, అనూహ్యంగా అధికారం చేజార‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో తాజా ఫ‌లితాల‌ని కేసీఆర్ జీర్ణించుకోలేక‌పోతున్నారు. త‌మ పార్టీని గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్ర‌జ‌లు ఈ సారి ఇలా ఓడించి కేవ‌లం ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం చేయ‌డం ఏంట‌నే ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

కేసీఆర్ ఇండియా కూట‌మిలో చేర‌తారా?…

ఇదిలా ఉంటే ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ దారేటు? ఆయ‌న ఇండియా కూట‌మిలో చేర‌తారా? లేక ఎన్‌డీఏ కూట‌మిలో చేర‌తారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉన్న ఇండియా కూట‌మిలో కేసీఆర్ చేర‌డం క‌ష్ట‌మ‌ని, ఆయ‌న‌ని కాంగ్రెస్‌తో పాటు ఈ కూట‌మిలోని ఇత‌ర పార్టీల కీల‌క నేత‌లు న‌మ్మ‌డం లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత లిక్క‌ర్ స్కామ్‌లో జైలుకు వెళుతుందా? అనే చ‌ర్చ మొద‌లైంది. దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది.

కేసీఆర్‌తో బీజేపీ క‌ల‌వాల‌నుకోవ‌డం లేదా?…

గులాబీ నేత కేసీఆర్‌ని బిజేపీ వ‌ర్గాలు ఎన్‌డీఏలోకి తీసుకోవాల‌నుకోవ‌డం లేదు. ఆ ఉద్దేశ్యం కూడా వారికి లేన‌ట్టుగా క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో వీరిద్ద‌రి ఉమ్మ‌డి శ‌త్రువు కాంగ్రెస్. దాన్ని ఓడించ‌డం కోసం లోపాయ‌కారి ఒప్పందాన్ని కేసీఆర్‌తో బీజేపీ చేసుకుంద‌ని, త‌ద్వారా తెలంగాణ‌లో అత్య‌ధిక సీట్ల‌ని ద‌క్కించుకోవాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే కేసీఆర్ తో లోపాయ‌కారి ఒప్పందం చేసుకుందే కానీ ఆయ‌న‌ని ఎన్‌డీఏలోకి ఆహ్వానించే ఉద్దేశ్యం బిజేపీకి లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక ఢిల్లీలో అత్య‌ధికంగా స్థానాల‌ని ద‌క్కించుకోవాలంటే క‌విత‌ని పావుగా వాడి కేజ్రీవాల్‌ని దెబ్బ‌కొట్టాల‌న్న ఆలోచ‌న‌లో బిజేపీ వర్గాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ ఇండియా కూట‌మిలో కానీ ఎన్‌డీఏలో కానీ చేర‌డం క‌ష్ట‌మేన‌ని, ఏం జ‌ర‌గ‌నుంద‌న్న‌ది మ‌రో నాలుగు నెల‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిందేన‌ని అప్ప‌టి ప‌రిస్థితుల‌ని బ‌ట్టి కేసీఆర్ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచాం. అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో క‌విత లిక్క‌ర్ స్కామ్ కార‌ణంగా త‌మ పార్టీ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల‌ని ద‌క్కించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని, లిక్క‌ర్ స్కామ్ కేసులో క‌విత జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో రాజీకీయ విశ్లేష‌కులు మాత్రం కేసీఆర్ అహంకార ధోర‌ణికి త‌గిన మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని కామెంట్‌లు చేస్తున్నారు.

Exit mobile version