JP Nadda : డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో కేసీఆర్ మోసం చేశారు: జేపీ నడ్డా

JP Nadda
JP Nadda : డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్ల హామీని పూర్తి చేస్తామని తెలిపారు. పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జేపీ నడ్డా మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మారుతుందని ఆయన చెప్పారు.
ఇప్పటికే ఫార్మా, పెట్రో కెమికల్స్ రంగాల్లో మన దేశం రెండో స్థానంలో ఉందని తెలిపారు. మేకిన్ ఇండియా ద్వారా తయారైన మొబైల్ ఫోన్లనే మనం వినియోగిస్తున్నట్లు నడ్డా చెప్పారు. దేశంలో 56 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామని, 52 వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుద్ధీకరణ పూర్తయిందని తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందని ఆయన వెల్లడించారు.