Kavya Maran : కావ్య మారన్ వేల కోట్ల అధిపతి అయిన కళానిధి మారన్, కావేరీ మారన్ దంపతుల ఏకైక కూతురు. కావ్య మారన్ కు ఎక్కువ మంది స్నేహితులు లేరు. దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన సన్ టీవీ కళానిధి మారన్ సొంతం. అయితే కావ్యను సన్ రైజర్స్ సీఈవోగా నియమించారు. 1992 సంవత్సరం ఆగస్టు 6న జన్మించిన కావ్య. ఇప్పటికీ ఓంటరిగానే ఉంది.
కావ్య బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆ మధ్యలో కొన్ని రూమర్స్ వచ్చినా.. అవేవీ నిజం కాదని తేలిపోయింది. కావ్య ఇంగ్లండ్ లో ని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఏంబీఏ పట్టా తీసుకుంది. సన్ రైజర్స్ టీం కంటే ముందు, సన్ మ్యూజిక్, ఎఫ్ ఎం మ్యూజిక్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
అయితే 2024 ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన వేలంలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆసీస్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ ను రూ. 20.50 కోట్లు పెట్టి కొనుగోలు చేయడంతో చాలా మంది వెకిలి నవ్వులు నవ్వారు. కానీ పదో స్థానంలో ఉన్న జట్టును ఫైనల్ కు చేర్చాడు. చివరి మెట్టుపై బోల్తా పడి త్రుటిలో కప్ చేజార్చుకున్నారు. కావ్య కోట్ల రూపాయలకు వారసురాలైన కూడా ఆమెకు అస్సలు గర్వం లేదని కొంతమంది నెటిజన్లు ఆమెను పొగుడుతున్నారు.
మరికొంతమంది మాత్రం ఆమె గొప్ప మనుసు ఉన్న మనిషి అంటున్నారు. ఎందుకో కావ్య మారన్ కు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరన్నారు. కానీ ఆమె వారి తల్లిదండ్రులకే గొప్ప మనుసు ఉన్న వ్యక్తి అని కొనియాడారు. కావ్య మారన్ సౌతాఫ్రికాలో జరిగే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టౌన్ జట్టును కూడా కొనుగోలు చేసింది. అక్కడ 2023, 24 లో జరిగిన సీజన్ లో రెండు సార్లు టైటిల్ గెలిచింది. ఈ సీజన్ లో ఎలాగైనా కప్ కొట్టాలని భావించిన కావ్య తన టీం ఫైనల్ లో ఓడిపోవడంతో కన్నీరు పెట్టుకుంది. అయినా ఏ మాత్రం బాధపడకుండా ప్లేయర్లను అభినందించింది.