Kavya Maran : కావ్య మారన్ నిజమైన ఐపీఎల్ చాంపియన్ అని చాలా మంది పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఐపీఎల్ 17 సీజన్ మొత్తం సన్ రైజర్స్ టీంతో ఉండి ఎక్కడా కూడా ఆటగాళ్లకు ఇబ్బందులు రాకుండా చూసుకుంది. వార్నర్, విలియమ్ సన్ లాంటి వాళ్లు జట్టు నుంచి దూరమై పాయింట్స్ టేబుల్స్ లో టీం 10 వ స్థానంలో ఉంటే ఏ మాత్రం బాధపడకుండా సన్ రైజర్స్ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టింది.
ఐపీఎల్ 17 ఆడిషన్ ఆటగాళ్ల వేలం సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు సంచనలంగా మారాయి. అప్పటి వరకు అన్ని సీజన్లలో కేవలం 16 కోట్లు మాత్రమే టాప్ బిడ్ గా ఉన్నా.. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ప్యాట్ కమిన్స్ ను 20.50 కోట్లకు కొనుగోలు చేసి చరిత్ర సృష్టించింది. ఈసారి కప్ గెలవడమే లక్ష్యంగా టీంను సిద్ధం చేసింది.
ప్రతి మ్యాచ్ ప్రతి క్షణం క్రికెట్ ను కావ్య ఆస్వాదించింది. టీం మూడు సార్లు 250 పరుగులు చేస్తే చూసి కేరింతలు కొట్టింది. మ్యాచులు ఓడిపోతే నిరాశ తో మొహం చిన్నబోయింది. కావ్య మారన్ అనుకున్నట్లు ఈ సారి ఐపీఎల్ రేసులో ఫైనల్ వరకు చేరినా సన్ రైజర్స్ చివరి మెట్టులో బోల్తా పడింది. దీంతో కావ్య ఏడుపును ఆపుకోలేక స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకుంది. చిన్నపిల్లల ఏడవడంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ అభిమానులు ఆమెను ఓదార్చుతున్నారు.
చాలా మంది ఫ్రాంచైజీ ఓనర్లు ఓడినా, గెలిచినా పెద్దగా పట్టించుకున్న సందర్భాలు ఉండవు. కానీ క్రికెట్ పై కావ్యకు ఉన్న ప్రేమ ఎంటో నిన్నటి మ్యాచ్ తో తేలిపోయింది. కోట్ల ఆస్తికి వారసురాలు, కూర్చుని తినేంత ఉన్నా కూడా ఆమెకు క్రికెట్ పై ఉన్న ఆసక్తి, మ్యాచ్ లో బంతి బంతికి ఆమె పడే ఆరాటం చూస్తే ముచ్చేటేస్తోంది. దీంతో క్రిెకెట్ అభిమానులు ఆమెను నిజమైన ఛాంపియన్ గా అభివర్ణిస్తున్నారు.