Kavya Maran : స్టేడియంలోనే కన్నీరు పెట్టుకున్న కావ్య మారన్..
Kavya Maran : రెండు నెలలకు పైగా సాగిన ఐపీఎల్-2024 మెగా టోర్నీ ఆదివారం (మే 26) తో ముగిసింది. ఫైనల్‌లో హైదరాబాద్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడో సారి టైటిల్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో అనూహ్య ప్రదర్శనలతో ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. చివరి మెట్టుపై బోల్తా పడడంతో సన్ రైజర్స్ అభిమానులు ఓటమిని తట్టుకోలేకపోతున్నారు.
వేలం నుంచి మొదలు మ్యాచ్ ఎక్కడ జరిగినా తమ జట్టుతో ఉండే ఎస్‌ఆర్‌హెచ్ యజమాని కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జట్టు ఓడినా.. గెలిచినా చప్పట్లతో మద్దతిచ్చే కావ్య.. ఫైనల్‌లో ఆరెంజ్ ఆర్మీ ఓడడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కళ్లలో నీరు తిరుగుతుండగా చప్పట్లు కొడుతూ కెమెరా కంట పడకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Sorry Kavya maran#KKRvsSRH #IPL2O24
pic.twitter.com/72wmGXHhgt pic.twitter.com/TZFY10fq8O
— Durbin 💜 (@Isolate21261459) May 26, 2024
చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. కోల్ కత్తా బౌలర్లు, ఫీల్డర్లు పట్టు భిగించడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో తక్కువ స్కోరుకే సన్‌రైజర్స్ పరిమితమైంది. లక్ష్య ఛేదనలో వెంకటేశ్ అయ్యర్ (52 నాటౌట్), గుర్బాజ్ (39)తో చెలరేగడంతో 10.3 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించి కోల్ కతా ఛాంపియన్‌గా నిలిచింది.
విజయానికి అడుగు దూరంలో తమ జట్టు ఉండడంతో కామన్ గానే కావ్య మారన్ కళ్లు చెమ్మగిల్లాయి. ప్రతీ సారి జట్టు సభ్యులతో సక్యంగానే మెలిగిన ఆమెకు జట్టు విజయం మాత్రం అందించకపోయింది. ఆమె కన్నీరు పెట్టుకోవడంతో పక్కనున్న వారు ఓదార్చారు.