JAISW News Telugu

Kavya Maran : కావ్య మారన్ ఫుల్ ఖుషీ..  

Kavya Maran

Kavya Maran

Kavya Maran : కావ్య మారన్ ఫుల్ ఖుషీ అవుతోంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 లో ఫైనల్ కు దూసుకెళ్లింది. దీంతో ఫైనల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆదివారం మ్యాచ్ ఆడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ 2 మ్యాచులో సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్స్, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసి ఫైనల్ కు దూసుకెళ్లింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి ఓవర్ లోనే సిక్సు, ఫోరు కొట్టి చివరి బంతికి ఔటయ్యాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లోనే 37 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే రాహుల్ త్రిపాఠి, మార్కమ్ రెండు పరుగుల తేడాతో అవుట్ కావడంతో 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అనంతరం ట్రావిస్ హెడ్ గేర్ మార్చి షాట్లు కొట్టడం ప్రారంభించాడు. క్లాసిన్ 50 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి సన్ రైజర్స్ 175 పరుగులతో ఇన్సింగ్స్ ను ముగించింది. యశస్వి జైశ్వాల్ మినహా రాజస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో సన్ రైజర్స్ 139 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ సీజన్ లో రాజస్థాన్ చివరగా ఎలిమినేట్ అయిన జట్టుగా నిలిచింది.

సన్ రైజర్స్ ఓనర్ కావ్య సంబరాలు మాత్రం అంబరాన్నంటాయి.  తండ్రి దయానిధి మారన్ ను హత్తుకుని గెలుపు సంబరాలు చేసుకుంది. వీవీఐపీ గ్యాలరీలో కూర్చుని తాను తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావడంతో పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేసింది.  సీజన్ ప్రారంభానికి ముందు  కావ్య మారన్ రూ. 20.50 కోట్లతో కమిన్స్ ను టీంలోకి తీసుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. టీమ్ కెప్టెన్ గా కూడా రాణించడంతో సన్ రైజర్స్ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. దీంతో కావ్య తీసుకున్న నిర్ణయం ఫలించిందని అభిమానులు సంబరపడిపోతున్నారు.

Exit mobile version