JAISW News Telugu

MLC Kavitha : కవిత జైలు సౌకర్యాల లిస్ట్ లో బంగారం..

MLC Kavitha

MLC Kavitha

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. ‘‘అక్కా.. తీహార్ జైలుకు స్వాగతం అంటూ సుఖేశ్ చంద్రశేఖర్ కవితకు రాసిన లేఖలు నిజమయ్యాయి. అక్కడ నిజంగానే తీహార్ జైలుకు వెళ్లారు. ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన పది రోజుల వరకూ కస్టడీలో ఉండడంతో జైలుకు తరలించలేదు. ఈడీ ఆఫీస్ లోనే ప్రశ్నించారు. కస్టడీ పూర్తయిన తర్వాత తీహార్ జైలుకు తరలించారు. ఈక్రమంలో ఆమె బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. విచారణ వాయిదా పడింది. ఆ తర్వాత జైలులో తనకు కావాల్సిన సౌకర్యాల లిస్ట్ ను జతచేసి మరో పిటిషన్ వేశారు. ఈ జాబితాలో ఆభరణాలు కూడా ఉండడం వైరల్ గా మారింది.

సాధారణంగా జైలుకు పంపితే..పొలిటికల్ వీఐపీలు తమకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతారు. ఈ హోదా సౌకర్యాల రూపంలో లభిస్తుంది. ఇంటి నుంచి భోజనం, మంచి పరుపు, న్యూస్ పేపర్లు, బుక్స్.. కొన్ని సందర్భాల్లో టీవీ కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే కవిత కూడా తనకు కావాల్సిన పలు సౌకర్యాలను కోరారు. ఇంటి నుంచి ఆహారంతో పాటు మంచి పరుపు, బెడ్ షీట్స్, స్లిప్పర్లు, బుక్స్, బ్లాంకెట్, పెన్ను, పేపర్లు, మెడిసిన్స్ తో పాటు జ్యూవెల్లరీ కూడా గమనార్హం.

ఆ జ్యూవెల్లరీ ఏమటన్న డిటైల్స్ లేవు. కానీ సహజంగా జైలుకు వెళ్లిన సమయంలో అసలు ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు ఉండనీయరు. కానీ మహిళలు సంప్రదాయబద్ధంగా కొన్ని ఆభరణాలు ధరిస్తారు. వాటిని తీసేయడం అశుభంగా భావిస్తారు. తాళి, మెట్టెలు, ఉంగరాలు వంటి వాటిని తీయరు. బహుశా కవిత ఈ ఆభరణాలను డిపాజిట్ చేయకుండా తన ఒంటి మీదనే ఉంచుకునేలా కోర్టు పర్మిషన్ అడిగా ఉంటారని భావిస్తున్నారు. నెక్లెస్ లు, హారాలు వేసుకుంటామని అడిగే సందర్భం లేదనే భావించవచ్చు.

Exit mobile version