MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ శకంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత బెయిల్ రాకపోవడంతో జైలు లో ఉంది. ప్రస్తుతం ఆమె గడుపుతున్న జైలు జీవితం ఒక అట బొమ్మల తయారైనది అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.గత నెల 15 తేదీన కవితను ముందుగా ED అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆరోజు నుంచి కవిత తిహాడ్ జైలు లోనే ఉంది. ED అనంతరం ఆమెను CBI విచారణ పేరిట కోర్ట్ అనుమతితో అదుపులోకి తీసుకొంది. ఒకరి తరువాత ఒకరు అంటే ED లేదంటె సిబిఐ ఇలా అరెస్ట్ చేయడం,జైలుకు పంపడం జరుగుతోంది. ఆమె తరుపు న్యాయవాదులు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగడం ఇలా ఆమె జైలు జీవితం ఒక అట బొమ్మల తయారైనది అని రాజకీయ శ్రేణులు చర్చించుకుంటున్నారు.కవిత కోసం గతంలో ED లేదా CBI వస్తున్నారంటే పెద్ద ఎత్తున ఆమె ఉన్న ప్రాంతంలో మీడియా,రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున హడావుడి చేసేవి. ఇప్పుడు ఆ హడావుడి ఎక్కడ కూడా కనబడుతలేదు.
తిహాడ్ జైల్లో కవిత ఎన్నడూ చూడని కష్టాలను చూస్తోంది.ప్రస్తుతం ఆమెను ఓదార్చడానికి కుటుంబసభ్యులు ఎవరు కూడా పోవడం లేదు. ఒక్కసారి మాత్రం తల్లి వెళ్ళింది. రెండుసార్లు అన్న కేటీఆర్ వెళ్లారు. వీరితోపాటు భర్త కూడా వెళుతున్నారు. తండ్రి కేసీఆర్ మాత్రం అసలే వెళ్ళలేదు.కూతురు జైలు లో ఉన్న భాదను దిగమింగుతూనే తండ్రి పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొంటున్నారు.
లిక్కర్ కేసు అంతా వట్టిదేనని ఇటీవల కేసీఆర్ అన్నారు. అంతేకాదు కవితను అన్యాయంగా అరెస్ట్ చేశారు అని కూడా ఆరోపించారు. కేవలం రాజకీయ కక్షలతోనే కవితను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.ప్రధాన మంత్రి ముఖ్య అనుచరుడైన సంతోష్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులను పంపినందుకు కక్షతో నా కూతురు కవితను అకారణంగా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
కూతురు కవిత అరెస్టును పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో వాడుకొని సానుభూతి పొందుతాడని రాజకీయ శ్రేణులు అభిప్రాయపడ్డారు. కానీ తన ప్రసంగాల్లో కేసీఆర్ ఎక్కడ కూడా కవిత జైలు విషయాన్నీ మాట్లాడటంలేదు. రాజకీయంగా కూతురు కవితను రక్షించుకోలేని కేసీఆర్ మనకేమి మేలు చేసిపెడుతాడని ఎదురు ప్రశ్నలు వస్తే సమాధానం చెప్పడం కష్టం అవుతుందనే కూతురు జైలు గురించి ఎక్కడ కూడా ప్రచారంలో ప్రస్తావించడంలేదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.తాజా పార్లమెంట్ ఎన్నికల్లో కేసీర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడని, ఈ ఎన్నికల్లో బీజేపీ కి కనీసం ఇందుకు పైగా సీట్లు వచ్చే విదంగా కేసీఆర్ సహకరిస్తే కవిత తిహాడ్ జైలు నుంచి ఇంటికి వస్తుందని. అంతేకాదు కేసు కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనే అభిప్రాయాలు సైతం రాజకీయ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి.