JAISW News Telugu

Kaun Banega Crorepati : కౌన్ బనేగా కరోడ్ పతి.. రూ.కోటి గెలిచేశాడు

Kaun Banega Crorepati

Kaun Banega Crorepati Winner

Kaun Banega Crorepati Show : కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) 16వ సీజన్ లో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్ గా 22 ఏళ్ల చందర్ ప్రకాశ్ నిలిచాడు. అయితే, రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినప్పటికీ రిస్క్ తీసుకోకుండా గేమ్ నుంచి క్విట్ అయ్యాడు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో బుధవారం జరిగిన ఎపిసోడ్ లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన కంటెస్టెంట్ చందర్ ప్రకాశ్ రూ. కోటి ప్రశ్నకు చేరుకున్నాడు.

‘‘ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ.. ‘శాంతి నివాసం’ అనే అరబిక్ పేరుతో ఆ నగరం ఓ పోర్టును కలిగి ఉంది’’ అని అమితాబ్ అడిగారు. దానికి ఎ.సోమాలియా, బి.ఒమన్, సి.టాంజానియా, డి.బ్రూనై అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అందులో చందర్ ప్రకాశ్ డబుల్ డిప్ లైఫ్ లైన్ ను ఉపయోగించుకుని ఆప్షన్ సి.టాంజానియాను ఎంచుకున్నాడు. అది సరైన సమాధానం కావడంతో రూ.కోటి గెలుచుకున్నట్లు బిగ్ బీ అమితాబ్ ప్రకటించాడు. వెంటనే షోలో ఉన్నవారంతా చప్పట్లతో అతడిని అభినందించారు. అమితాబ్ సీట్లో నుంచి లేచి అతడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. చందర్ ప్రకాశ్ రూ.కోటితో పాటు ఓ కారును కూడా బహుమతిగా అందుకున్నాడు.

అనంతరం చందర్ ప్రకాశ్ రూ.7 కోట్ల ప్రశ్నకు చేరుకున్నాడు. ‘‘1857లో ఉత్తర అమెరికాలో ఇంగ్లీష్ దంపతుకు జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?’’ 1ని అమితాబ్ ప్రశ్నించాడు. దీనికి ప్రకాశ్ కు జవాబు తెలియకపోవడంతో పాటు అప్పటికే లైఫ్ లైన్లు అన్నింటిని వినియోగించుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో షో నుంచి క్విట్ అయ్యాడు. ఆ తర్వాత అమితాబ్ సరదాగా ఆ ప్రశ్నకు సమాధానం ఊహించుమని అడిగారు. అతడు ఆప్షన్ ఎ.వర్జనీయా డేర్ అని చెప్పగా, అదే సరైన జవాబని అమితాబ్ తెలిపారు.

Exit mobile version