
Spiritual
Spiritual News : కార్తిక మూడవ సోమవారం శైవక్షేత్రాలు భక్తుల దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన ఆలయాలతో పాటు, పల్లెల్లో ఉన్న శివాలయాల్లోనూ లయకారుడికి కార్తిక సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారు జామున కృష్ణా, గోదావరి నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించి, కార్తిక దీపాలను వదిలారు. శ్రీశైలం, విజయవాడ, రాజమండ్రి, వేములవాడ, భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి ప్రధాన ఆలయాల్లో భక్తులు వేకువజాము నుంచే దర్శనాలకు పోటెత్తారు. పరమశివుడుని దర్శించుకుని తరించారు. ముఖ్యంగా విజయవాడలోని కృష్ణా తీరానికి, రాజమండ్రిలో గోదావరి తీరానికి భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు.