
CM Chandrababu – IAS Karthikeya Mishra
Karthikeya Mishra : ఏపీ సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్ గా ఉన్నారు. దీంతో ఆయన్ను ఏపీ సర్వీసుకు పంపాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీవోపీటీ కార్తికేయ మిశ్రాను ఏపీ క్యాడర్ కు పంపిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన ఆయన.. ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు.
కాగా, కేంద్ర సర్వీసుల్లో ఉన్న పలువురు ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేయవలసిందిగా కోరుతూ సీఎం లేఖ రాశారు. దీంతో ఇప్పటికే కేంద్ర సర్వీసుల నుంచి ఐఏఎస్ పీయుష్, ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా రిలీవ్ అయ్యారు. తాజాగా, కార్తికేయ మిశ్రా రిలీవ్ అయ్యారు. ఆయన 2009 ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి.