Karnataka : నిండుతున్న కర్నాటక ప్రాజెక్టులు
– ఆల్మట్టి నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు విడుదల
కర్నాటకలోని కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలోని ఆల్మట్టి డ్యాం నుంచి రాత్రి 7 గంటలకు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాంలో 517.52 (ఫుల్ కెపాసిటీ 519.60 మీటర్లు) మీటర్ల వరకు నీటిని నిల్ల చేసి 15 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదలుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 28,130 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. నారాయణపూర్ డ్యాంలో 37.64 టీఎంసీలకు గాను, 25.815 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టకు ఎగువ నుంచి 3,413 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తోంది.
త్వరలో అక్కడి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటాయని, దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉందని జూరాల ఆఫీస్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జూరాలలో 317.490 మీటర్ల నిల్వ ఉండగా, 3,271 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తోంది. నెట్టెంపాడు లిఫ్ట్ కు 750 క్యూసెక్కుల నీరు, భీమా లిఫ్ట్ కు 528 క్యూసెక్కులు, లిఫ్ట్ కెనాల్ కు 390 క్యూసెక్కుల నీరు మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి 1,778 క్యూసెక్కుల నీటిని కిందికి వదలుతున్నారు.