Kargil 25th Vijay Divas : కార్గిల్ 25వ విజయ్ దివస్.. పీఎం మోదీ నివాళులు

Kargil 25th Vijay Divas, PM Modi
Kargil 25th Vijay Divas : కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు పీఎం నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. కార్గిల్ 25వ విజయ్ దివస్ ను పురస్కరించుకొని కార్గిల్ లోని ద్రాస్ లో గల యుద్ధవిరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు అంజలి ఘటించారు.
1999లో ఆపరేషన్ ‘‘విజయ్’’ విజయానికి గుర్తుగా ఏటా జూలై 26న భారత దేశం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటోంది. ఈ యుద్ధంలో జమ్ముకశ్మీర్ లోని కార్గిల్ సెక్టార్ లో పాక్ సైనికులు, ఉగ్రవాదులు చొరబడిన వ్యూహాత్మక స్థావరాలను భారత దళాలు విజయవంతంగా తిరిగి దక్కించుకున్నాయి. ద్రాస్ వార్ మెమోరియల్ అని కూడా పిలిచే వార్ మెమోరియల్ ని సైనికుల ప్రాణ త్యాగానికి గుర్తుగా భారత సైన్యం నిర్మించింది. ఇది నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ లోని కార్గిల్ జిల్లాలో ఉంది.
25వ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు.