Karan Bhushan Singh : బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్ వాహనాలపైకు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. మహిళా రెజ్లర్ల ఆరోపణలతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆయన తనయుడు కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్ లోని కారు వాహనదారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గోండా నగర సమీపంలోని రహదారిపై ఈ ఘటన జరిగింది. దీనిపై ఫిర్యాదు నమోదైంది.
తన కుమారుడు (17), సమీప బంధువు (24) కలిసి బైక్ పై బయటకు వెళ్లగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారని ఫిర్యాదుదారు తెలిపారు. గాయపడిన మరొక వ్యక్తం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో కరణ్ ఆ కాన్వాయ్ లో ఉన్నారా? లేదా? తెలియవలసి ఉంది.
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఉన్న బ్రిజ్ భూషణ్ ను బీజేపీ పక్కన పెట్టింది. ఆయన కుమారుడు కరణ్ భూషణ్ కు కైసర్ గంజ్ టికెట్ కేటాయించింది. దీనిపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ దేశ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా..? ఒక్క వ్యక్తి ముందు లొంగిపోయిందా..? అని రెజ్లర్లు ప్రశ్నించారు.