Pawan Kalyan : కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కరలేదు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan
Pawan Kalyan : ఏపీలో చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమే లేదంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఓ ఇంగ్లీషు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముస్లిం రిజర్వేషన్ల అంశంలో బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకటనలకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపడంత్ పాటు రిజర్వేషన్లు కోరుకునేవారందరికీ కల్పించడం సాధ్యం కాదని కూడా పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచన చేయాలన్నారు.
ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ప్రతినిధి ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్ ను ప్రశ్నించినప్పుడు బీజేపీ ముస్లింటకు వ్యతిరేకం కాదని, రిజర్వేషన్ల అమలు కన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని పవన్ సూచించారు. రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని, రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని పవన్ చెప్పారు.