Kapu Voters : కాపు కులస్తులు పవన్ వైపు లేరు

Kapu Voters

Kapu Voters Which Side

Kapu Voters : మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి విమర్శలు గుప్పించి వార్తల్లోకి ఎక్కారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ అయన రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు పర్సనల్ గ ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి కానీ ఆయన కుటుంబం గురించి బహిరంగంగా ఎప్పుడు మాట్లాడలేదంటూనే మరోవైపు పవన్  పై మాత్రం తీవ్ర విమర్శలు చేయడం విశేషం.

పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు వివాహాల గురించి మాట్లాడిన తీరును సమర్ధించుకోవడం విశేషం.వ్యక్తిగతంగా ద్వేషం లేదంటూనే పవన్ వ్యక్తిగతంగా చేసుకున్న పెళ్లి గురించి మాట్లాడటంపై జనంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. రాజకీయంగా ఎవరు పార్టీ పెట్టిన సిద్ధాంత పరంగా ఉండాలని అంటున్న నాని కి మాత్రం వైసీపీ లో ఆయన సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీలో ఉంది. చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకోలేదు. తాజా ఎన్నికల్లో పవన్ టీడీపీ తో మాత్రమే పొత్తు పెట్టుకోలేదు. బీజేపీ తో కలిపి పొత్తుకెళ్లారు. ఎన్డీయే సమావేశానికి కాషాయం పెద్దలు కేవలం పవన్ ను మాత్రమే పిలిచారు. చంద్రబాబును పిలువలేదు. ఇది గమనించకుండా పేర్ని నాని చంద్రబాబు కోసమే పవన్ జనసేన స్థాపించాడని ఆరోపించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు అంటేనే ఇష్టమని, అన్న చిరంజీవి అంటే ఇష్టం లేదని అంటున్న నాని మాటల వెనుక పెద్ద అర్థమే దాగి ఉందంటున్నారు. అన్నదమ్ముల మధ్య బేధాలు తీసుకురావడానికి నాని ఆలా మాట్లాడి ఉంటారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలనే పవన్ కు చిరంజీవి ఐదు కోట్ల రూపాయలను పార్టీ విరాళం కోసం ఇచ్చిన విషయం తెలిసి కూడా నాని ఆ విదంగా మాట్లాడిన తీరు సరిగా లేదంటున్నారు.

జనసేన అధినేతను ఎప్పుడు తిట్టలేదు అంటూనే వ్యక్తిగతంగా మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడిన మాటలు దేనికి సరిపోతాయంటున్నారు రాజకీయ శ్రేణులు. మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడిన మాటల్లో సంస్కారం ఎక్కడ ఉందని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పవన్ మాట్లాడిన మాటల్లో సంస్కారం లేదని అంటున్న నానికి రాజకీయ సంస్కారం ఉందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

TAGS