JAISW News Telugu

Justice : జగన్ హయాంలో జరిగిన అరాచకానికి తల్లడిల్లిన కన్నతల్లి.. సారు మీరే న్యాయం చేయాలి

Justice

Justice

Justice : తన పేరు మీద ఉన్న ఆస్తిని కొట్టేయడానికి కొందరు హత్య చేస్తే.. దానిని విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతి రాణా, డీసీపీ విశాల్‌గున్నీ గుండెపోటు మరణమని పేర్కొంటు కేసును పక్కదారి పట్టించారని ఓ మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆశ్రయించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ఇబ్రహీంపట్నం జిల్లాకు చెందిన విజయరాణి, కాంతిరానా తాతా, విశాల్‌గున్నిపై ఫిర్యాదు చేశారు. ‘‘నా కొడుకు పేరు మీద రూ.50 కోట్ల ఆస్తి ఉంది.. దాన్ని కొట్టేయాలన్న ఉద్దేశంతో నా భర్త రెండో భార్య కుమారుడు నా కుమారుడి ముఖంపై యాసిడ్‌ పోసి హత్య చేశాడు. దీనిపై అప్పటి విజయవాడ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేశాం. అయితే వారు మా కుమారుడు గుండెపోటుతో చనిపోయాడని కేసును పక్కదారి పట్టించారు. 19 నెలలుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నా. మాకు న్యాయం చేయండి’’ అంటూ సీఎం చంద్రబాబుకు మొరపెట్టుకుంది.

కేసును మళ్లీ విచారించి న్యాయం చేస్తానని బాధితురాలికి సీఎం హామీ ఇచ్చారు. వినతులను సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా తక్షణం చర్యలు తీసుకోవాలని తన పేషీ అధికారులను ఆదేశించారు. జగన్ హయాంలో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాతా, విశాల్ గున్ని ఎంతగా బరితెగించారో… అనడానికి ఈ ఉదంతం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  ఇదే కాకుండా నటి కాదంబరీ జైత్వానీ కేసులో కూడా వీరు అత్యుత్సాహం ప్రదర్శించారు. పెద్దల అండను చూసి రెచ్చి పోయారు. ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం ఉన్న పదవులు కోల్పోయి చేసిన పనులకు పశ్చాత్తాపం పడుతున్నారు.

Exit mobile version