Kangua flop : కంగువా ఫ్లాప్.. ఇందులో ఎవరిది తప్పు ?
Kangua flop : సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరగొచ్చు అనడానికి “కంగువ” సినిమా మరో పెద్ద ఉదాహరణ అంటున్నారు జనాలు. కంగువ సినిమా కోసం సూర్య ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. తిండి, నిద్రను కూడా లెక్క చేయకుండా కొన్నేళ్లుగా రాత్రి పగలు కష్టపడి పనిచేశాడు. ఈరోజు సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సూర్య నటన పర్వాలేదు.. కానీ దర్శకుడు రాసుకున్న కథను జనాలకు చెప్పడంలో విఫలమయ్యాడని అంటున్నారు.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10,000 స్క్రీన్లలో విడుదలైంది. 1000 కోట్లతో తొలి తమిళ చిత్రంగా ఈ సినిమా ఉంటుందని అంచనా వేశారు. గోపీచంద్‌తో శౌర్యం, శంఖం వంటి చిత్రాలతో శివ తన కెరీర్ ప్రారంభించారు. రవితేజ నటించిన దరువు సినిమా ఫ్లాప్ అవ్వడంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యాడు. కోలీవుడ్‌లో ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వీరమ్, వేదాళం, వివేగం, విశ్వాస.. మొత్తం నాలుగు చిత్రాలు అజిత్‌తోనే ఉన్నాయి.
రజనీకాంత్ నటించిన ఆయన చివరి చిత్రం అన్నాత్తే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా 350 కోట్ల బడ్జెట్‌తో కంగువ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైనా అది నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.శివ తనను తాను ఎస్ఎస్ రాజమౌళి లేదా ప్రశాంత్ నీల్ అని అనుకున్నారు. పెద్ద పీరియాడికల్ సినిమాలు తన కప్ ఆఫ్ టీ కాదని అతను గ్రహించలేకపోయారు. కంగువలో మొదటి 40 నిమిషాలు చాలా భయంకరంగా ఉన్నాయి. కంగువ లాంటి సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఉంటాయంటే నమ్మశక్యంగా లేదు. కాబట్టి కంగువ వంటి చిత్రాన్ని హ్యాండిల్ చేయగల తన సామర్థ్యాన్ని అతిగా అంచనా వేయడంలో శివ చేసిన తప్పా లేక సూర్య తప్పుడు తీర్పునా? శివ ఫిల్మోగ్రఫీ తెలిసినప్పటికీ ఈ తరహా సబ్జెక్ట్‌కి అతను న్యాయం చేస్తాడని సూర్య ఎలా అనుకున్నాడో అర్థం కాలేదంటున్నారు ఆయన అభిమానులు.