Bandi Sanjay : బండి సంజయ్ ని పట్టించుకోని కంగనా రనౌత్.. నెట్టింట వైరల్

Bandi Sanjay
Bandi Sanjay : ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే కూటమి సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎన్డీయే కూటమి నేతలు మోదీని మూడోసారి ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోల్ అవుతున్నారు.
ఈ సమావేశానికి ముందేు మండీ ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ లు ఒకరికి ఒకరు కలిసి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన బండి సంజయ్ శుభాకాంక్షలు తెలుపుదామని కంగనాకు ఫ్లవర్స్ బొకే ఇవ్వగా బండి ఎవరో తెలియని కంగనా అయన వైపు చూసి పట్టించుకోకుండా వెళుతుంది. దీంతో బండిని బీజేపీ అధిష్టానమే కాకుండా కంగనా కూడా పట్టించుకోలేదంటూ నెటిజన్లు కాంమెంట్లు పెడుతున్నారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Em chesthunnav Anna @bandisanjay_bjp pic.twitter.com/hziXEGlbJE
— VB (@Mr_ViolentBoy) June 7, 2024