Kangana Ranaut : ‘మండి’ నుంచి నామినేషన్ వేసిన కంగనా రనౌత్
Kangana Ranaut : హిమాచల్ ప్రదేశ్‌లోని ‘మండి’ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్ మంగళవారం (మే 14) నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానంలో ఆమెపై పోటీగా విక్రమాదిత్య సింగ్‌ను కాంగ్రెస్ బరిలో నిలిపింది. గతంలో ఈ సీటును బీజేపీ గెలుచుకుంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి లోక్‌సభకు కంగనా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్ దాఖలుకు హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరాం ఠాకూర్ హాజరయ్యారు.
మండి సీటుపై కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా ఉంది. ఎందుకంటే దివంగత నేత వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ను కాంగ్రెస్ పోటీకి దింపింది.
నామినేషన్ దాఖలు చేసే ముందు, కంగనా మాట్లాడుతూ.. ఈ రోజు ప్రధాని మోడీ కాశీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం.. నేను మండి నుంచి దాఖలు చేయడం అదృష్టంగా భావిస్తున్నారు. మండిని ఛోటీ కాశీగా అభివర్ణించారు.
నామినేషన్ కు ముందు కంగనా రనౌత్ కూడా మండిలో రోడ్ షో చేసింది. ఈ సమయంలో, జైరామ్ ఠాకూర్, పార్టీ నాయకులు ఆమె ప్రచార వాహనంపై ఉన్నారు. రోడ్ షో సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కంగనా నామినేషన్ సమయంలో ఆమె తల్లి ఆశా రనౌత్ కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఆమెకు మంచి స్పందన వస్తోందని ఆమె తల్లి అన్నారు. కంగనా గెలవాలని పూజులు చేయాలని అడుగుతున్నాం. ఈ వ్యక్తులు కంగనాపై పౌరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఇది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా మహిళలపై ఇలాంటి పదజాలం మంచిది కాదు అని ఆమె తల్లి అన్నారు. ప్రతి ఒక్కరి ఇళ్లలో మహిళలు, కుమార్తెలు ఉన్నారని ఆమె అన్నారు.
ప్రధాని మోడీ మూడోసారి ప్రధాని కావడం భారతదేశానికి అదృష్టమని కంగనా అన్నారు. మండి కూతురికి అవకాశం ఇవ్వడం ద్వారా హిమాచల్ మొత్తం గర్వపడేలా చేస్తానని ఆమె వాగ్ధానం చేశారు. .
ఇది నాకు మొదటి మరియు చివరిది ఎన్నిక కాదని నేను ఆశిస్తున్నాను. ఛోటీ కాశీ నుంచి కూడా చాలాసార్లు నామినేషన్ దాఖలు చేసే అవకాశం వచ్చింది. జూన్ 4న విజయ పతాకాన్ని ఎగురవేస్తామని తెలిపారు.
View this post on Instagram