Kamma Spiritual Gathering : మే 24న అట్లాంటాలో కమ్మ వారి ఆత్మీయ సమ్మేళనం

Kamma Spiritual Gathering
Kamma Spiritual Gathering : అట్లాంటాలో ‘కమ్మ వారి ఆత్మీయ సమ్మేళనం-2025’ మే 24న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖ అతిథులు, సాహితీవేత్తలు, కళాకారులు మరియు సినీ తారలు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఈ సమ్మేళనంలో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అలాగే, ప్రేక్షకులను ఆకట్టుకునే పలు కార్యక్రమాలు మరియు ఆకర్షణీయమైన వినోదాలు ఏర్పాటు చేయబడ్డాయి.
తెలుగు సంస్కృతిని పరిరక్షించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ సమ్మేళనం అట్లాంటాలోని తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక అనుభూతినిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం అందరినీ అలరిస్తుందని వారు పేర్కొన్నారు.