
Kamal Hasan
Kamal Hasan : మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభ సభ్యుడు కానున్నారు. ఈ మేరకు పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్ తెలిపారు. గతంలో డీఎంకేతో పొత్తులో భాగంగా ఒక రాజ్యసభ సీటును కమల్ హాసన్ పార్టీకి కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. జూలైలో డీఎంకేకు చెందిన ఇద్దరు సభ్యుల పదవీకాలం ముగియనుండగా, వారిలో ఒకరి స్థానంలో కమల్ హాసన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కమల్ హాసన్ తిరిగి వచ్చిన తర్వాత జూలైలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తంగవేల్ వెల్లడించారు.