Kamal Haasan : పవన్ కు కమల్ హాసన్ విషెస్

Kamal Haasan
Kamal Haasan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించాడు. 21 స్థానాల్లో పోటీ చేసి 21 గెలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయారు. పవన్ కళ్యాణ్ కి దేశ రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదిక గా యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ పవన్ కళ్యాణ్ విజయం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ తో ఎంతో భావోద్వేగ సంభాషణ జరిగినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విజయం సాధించిన శ్రీ పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు సేవ చేసే ఈ యాత్రను ప్రారంభించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నీ గురించి గర్విస్తున్నాను సోదరా అంటూ చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.