Kalyan dev:బ్రేక‌ప్ త‌ర్వాత మెగా అల్లుడు ఏం చేస్తున్నాడు?

Kalyan dev:ఒక‌ప్ప‌టి మెగా అల్లుడు, యువ‌హీరో క‌ళ్యాణ్ దేవ్ త‌న ఇంట్లో జ‌రిగిన ఓ శుభ‌కార్యం గురించి ఇన్ స్టా వేదిక‌గా వెల్లడించారు. త‌న సోద‌రి సీమంతానికి సంబంధించిన ఫోటోని షేర్ చేసి కుటుంబం పెరుగుతోంద‌ని ఆనందం వ్య‌క్తం చేసారు. త‌న సోద‌రి, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, కళ్యాణ్‌దేవ్ జంట‌ విడాకుల గురించి చాలా కాలం పాటు చ‌ర్చ సాగింది. చివ‌రికి ర‌క‌ర‌కాల సంజ్ఞ‌ల ద్వారా ఈ జంట విడాకుల ప్ర‌క్రియ గురించి వెల్ల‌డించారు.

శ్రీజ- కళ్యాణ్ మార్చి 2016లో బెంగళూరులోని దేవనహళ్లి సమీపంలోని కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె న‌విష్క ఉన్నారు. కళ్యాణ్‌కు ముందు శ్రీజ 19 ఏళ్ల వయసులో తన కాలేజీ స్నేహితుడు శిరీష్ భరద్వాజ్‌ని వివాహం చేసుకుని ఆ త‌ర్వాత విడిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే, తన అత్తమామలు వరకట్నం డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ శిరీష్ నుండి 2011లో చట్టబద్ధంగా విడిపోయింది. ఇప్పుడు రెండో పెళ్లి బ్రేక‌ప్ అవ్వ‌డం ఊహించ‌నిది.

కళ్యాణ్ దేవ్ 2018లో మాళవిక నాయర్‌తో కలిసి విజేత చిత్రంతో అరంగేట్రం చేశాడు.అదే సంవత్సరం అతను పులి వాసు దర్శకత్వం వహించిన తన రెండవ చిత్రం సూపర్ మచ్చికి సంతకం చేసాడు. అనేక వాయిదాల తర్వాత, ఈ చిత్రం జనవరి 2022లో సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. దేవ్ తదుపరి చిత్రం కిన్నెరసాని డిసెంబర్ 2020లో ప్రారంభ‌మైనా ప‌లుమార్లు నిర్మాణ జాప్యాల తర్వాత జూన్ 2022లో ZEE5లో విడుదలైంది.

2021 లో అతడి తదుపరి మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించారు. అవికా గోర్ క‌థానాయిక‌గా న‌టించారు. క‌ళ్యాణ్ దేవ్ ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌డం లేదు. తండ్రి బిజినెస్ ల‌తో బిజీగా ఉన్నాడ‌ని స‌మాచారం.

TAGS