Kaliki Pre-release Event : ఆకట్టుకోని ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఏంట్రా ఇదీ? అంటూ కామెంట్లు..
Kaliki Pre-release Event : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’. కేవలం భారీ బడ్జెటే కాదు.. భారీ తారగణం కూడా ఇందులో కనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ మరో వారంలో (జూన్ 27-గురువారం) ఉంది. ఈ నేపథ్యంలో మూవీపై అటెక్షన్ గ్రాబ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇటీవల ముంబై వేదికగా ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు స్టార్స్ అందరూ కలిసి వచ్చారు. హీరో ప్రభాస్, విలన్ కమల్ హాసన్, హీరోయిన్ దీపికా పదుకొణె, లీడ్ రోల్ అమితాబ్ బచ్చన్. ఉత్తర, దక్షిణానికి చెందిన భారీ తారలు ఒకే వేదికపై కలవడం చాలా అరుదైన ఘటన. వీరి కలయిక హిందీ బెల్ట్ లో సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేస్తుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబై వేదికగా ప్లాన్ చేశారు అశ్వినీదత్.
ఈ ఈవెంట్ పై భారీగా అంచనాలే ఉన్నాయి. అయితే, ఇది గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ఇండోర్ ప్రెస్ మీట్ లా అనిపించింది. దర్శకుడు నాగ్ అశ్విన్ లేకపోవడం వల్ల ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
దురదృష్టవశాత్తు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. కెమెరాలను సరిగా ఏర్పాటు చేయకపోవడంతో సోషల్ మీడియా లైవ్ స్ట్రీమ్ చూస్తున్న వారు జూమ్ చేసి స్టార్లను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈవెంట్ మేనేజ్ మెంట్ సిద్ధంగా లేకపోవడంతో హాజరైన మూవీ జర్నలిస్టుల్లో నిరుత్సాహం కనిపించింది. లెజెండరీ తారలను చూసే అవకాశం ఉన్నప్పటికీ నిర్వహణ లోపంతో చాలా మంది పెదవి విరిచారు.
ఇది ఇంత పెద్ద ఫ్లాప్ కావడంతో దక్షిణాదిలో మరింత ప్రొఫెషనలిజంతో నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లైనా, సాంకేతిక అంశాలైనా తెలుగు రాష్ట్రాల్లోని ఈవెంట్ మేనేజర్లు పెద్ద జనసందోహాన్ని కూడా సమర్థవంతంగా డీల్ చేసి, ముంబైలో జరిగిన ఈ ఈవెంట్ లో లేని సామర్థ్యాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నారు. ఏమవుతుందో చూడాలి మరి.